డైనింగ్‌ హాల్‌ అలంకరణ.. జాగ్రత్తలు...!

మంగళవారం, 8 ఏప్రియల్ 2014 (16:42 IST)
File
FILE
కుటుంబ సభ్యులంతా కలిసి ఎక్కువ సమయం మాట్లాడుకునేందుకు అనువైన ప్రదేశమే డైనింగ్ హాల్. కాబట్టి.. అక్కడ వాతావరణం ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవాలి. ఈ గదిని గాలి, వెలుతురు వచ్చే ప్రదేశంలో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే, తాజా గాలి మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

డైనింగ్ హాల్‌లో సౌకర్యవంతమైన కుర్చీల ఏర్పాటు మాత్రం తప్పనిసరి. లైటింగ్, అలంకరణ ఏర్పాట్లు మరీ ఎక్కువగా లేకుండా, గది వంటింటికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. అంతేగాకుండా అతిథులు వచ్చినప్పుడు వారితో కలిసి భోంచేసే విధంగా పెద్ద డైనింగ్ టేబుల్‌ (వారి, వారి సామర్థ్యాలను బట్టి)ను ఏర్పాటు చేయాలి.

అలాగే... ఇంట్లో ఎంత సామగ్రి ఉన్నా అవసరానికి అవి ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవడంలోనే సమయం వృధా అవుతుంది. కాబట్టి, డైనింగ్ హాల్‌లోని కప్‌బో‌ర్డ్‌లో ఏ వస్తువు ఎక్కడ పెట్టామో కనిపించాలంటే గ్లాస్‌ఫిటింగ్‌ ఉండేలా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.

వెబ్దునియా పై చదవండి