స్నానాల గది సౌకర్యంగా, అందంగా మెరిసిపోవాలంటే..

శుక్రవారం, 11 ఏప్రియల్ 2014 (18:33 IST)
File
FILE
తక్కువ స్థలంలో నిర్మించే స్నానాల గదులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ముదురు రంగుల ఎంపికకు దూరంగా ఉండటం మంచిది. గోడలకు ఎప్పుడూ లేలేత రంగులో ఉండే టైల్స్‌నే వేయించాలి. తెల్లటి కాంతినిచ్చే బల్బులను అమర్చితే, ఆ విద్యుత్ కాంతుల వెలుగులో చిన్నగా ఉండే బాత్‌రూమ్‌‌ కాస్తా విశాలంగా కనిపిస్తుంది. స్నానాల గదిలో వాష్ బేషిన్లు వాడటం ఆధునికంగా, ఉపయోగకరంగా ఉంటుంది. అయితే వాటిని తక్కువ స్థలంలో అమర్చగలిగే విధంగా జాగ్రత్త పడాలి.

అక్రిలిక్ షీట్ లేదా మార్బుల్స్‌తో బాత్‌రూమ్‌ మూలల్లో అరల్లాగా నిర్మించుకోవాలి. వీటిలో సబ్బు, షాంపూలు, ఇతర వస్తువులను పొందికగా అమర్చుకునే విధంగా చూడాలి. షవర్‌ ఏర్పాటు ప్రత్యేకంగా ఉండాలనుకునే వారు అద్దం లేదా అక్రిలిక్ షీట్‌తో బాత్‌రూమ్‌‌లో పార్టిషన్ ఏర్పాటు చేస్తే స్థలం కూడా వృధా కాకుండా ఉండటమే కాకుండా, ఇరుకుగా అనిపించదు.

స్నానాల గదిలో వస్తువులను ఎక్కడపడితే అక్కడ అలాగే వదిలివేయకూడదు. అలా వదిలివేస్తే గది ఇరుకుగా తయారవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆయా వస్తువులను అక్కడి నుండి తీసివేయటమే గాకుండా అక్కడ తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులను నీట్‌గా సర్దుకుంటే, చిన్నదైనా సౌకర్యంగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి