మీరు ఉద్యోగినులా.. అయితే ఎప్పుడూ ఏదో ఒక మార్పు అవసరం!

FILE
మీరు ఉద్యోగినులా.. అయితే ఎప్పుడూ ఏదో ఒక మార్పు చేస్తూవుండండి.. అంటున్నారు మానసిక వైద్యులు. ఉద్యోగపరంగా, మీ వ్యక్తిత్వ, వ్యవహారశైలిలో కొత్త పద్ధతులు ఉండేలా చూసుకోండి. బాగా శక్తిమంతులైనవారు నిరంతర కొత్తదనాన్ని కోరుకుంటారు. పాతవాటితో సరిపుచ్చుకోరు. తమను తామ కాలంచెల్లిన వ్యక్తులుగా ఎన్నటికీ చేసుకోరు.

ఎప్పటికప్పుడు మీ జీవితానికో నూతనత్వాన్ని కల్పించండి. అంతకుముందెప్పుడూ తినని ఆహారాన్ని రుచి చూడండి. ఆఫీసుకు వెళ్ళే మార్గాన్ని మార్చుకోండి. మీరు షాపింగ్‌ చేసే దుకాణాలనో, వ్యాయామశాలనో మార్చండి. తాజాగా రిలీజైన సీడీ వినండి

మీరు సాధారణంగా చదివే పుస్తకాలకు భిన్నమైనదాన్ని ఎంచుకోండి. ఇంకా ఏదైనా కొత్త క్రీడలో పాల్గనండి. ఏదైనా కొత్త ప్రదేశానికి విహారయాత్రగా వెళ్ళండి. మీ జీవితం ఎప్పుడూ ఏదోక మార్పులు సంతరించుకోనివ్వండి. అప్పుడు దైనందిన జీవితం రొటీన్‌గా, బోర్‌గా ఉండక నమన్మేషమయినది అవుతుంది.

వెబ్దునియా పై చదవండి