మీరు వర్కింగ్ విమెనా...? ఐతే బ్రేక్‌ఫాస్ట్ మానకండి!

FILE
చాలామంది వర్కింగ్ విమెన్ పని హడావుడిలో బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడమే మరిచిపోతుంటారు. ఇంకా టిఫిన్ చేయడాన్నే పక్కన పెట్టేస్తారు. అయితే బ్రేక్ ఫాస్ట్‌ని ఎవరూ తీసుకోకుండా ఉండకూడదని న్యూట్రీషన్లు అంటున్నారు. శరీరానికి నిరంతరాయంగా శక్తి అందుతూ ఉండాలి.

అప్పుడే సజావుగా అది తన పనులు తాను చేసుకోగలుగుతుంది. రాత్రి 8-9 గంటల సమయంలో భోజనం చేసి పడుకొంటే ఉదయం బ్రేక్‌ ఫాస్టును పక్కన పెట్టేస్తారు. లేదంటే ఆఫీసుకి వెళ్లాక 10-11 అయ్యాక అప్పుడు తింటారు.

అంటే రోజులో 24 గంటలు ఉంటే అందులో సగం సేపు అంటే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9గంటల దాకా ఏమీ తీసుకోరు అన్నమాట. తర్వాత సగం సేపులోనే మొత్తం ఆహారాన్ని తీసుకొంటారు.

దీని వలన జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. అంతే గాకుండా ఉదయం పూట శరీరానికి కావలసిన శక్తి ఏమాత్రం అందదు. పైగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధిగమించాలంటే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం ఒక్కటే మార్గమని న్యూట్రీషన్లు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి