నిర్భయకు భారతపుత్రిక అవార్డు : తల్లిదండ్రులకు అప్పగింత

FILE
ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు నిర్భయకు భారతపుత్రిక అవార్డు లభించింది. ఢిల్లీ నడివీధులలో రాక్షస మూక చేతిలో బలైపోయిన జ్యోతిసింగ్ అలియాస్ నిర్భయకు భారతపుత్రిక అవార్డుతో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాళి అర్పించారు. ఢిల్లీలో జరిగిన ఎన్‌‌డిటివి ఇండియన్స్ ఆఫ్ ధ ఇయర్ అవార్డుల కార్యక్రమంలో నిర్భయ తల్లిదండ్రులకు 'భారత పుత్రిక' అవార్డును ప్రదానం చేసిన అనంతరం ప్రధాని మాట్లాడారు.

నిర్భయ మరణం వృధా కాబోదని... ఆమె మనందరికీ స్ఫూర్తి అని ప్రధాని చెప్పారు. ఇంకా మహిళల రక్షణ, భద్రత కోసం పనిచేస్తామని ప్రధాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

కాగా గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన నిర్భయ కదిలే బస్సులో నలుగురు కామాంధులచే సామూహిక అత్యాచారానికి గురై సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి