ఎన్నికల ప్రచారంలో అలనాటి తార శ్రీదేవి.. అమర్ సింగ్‌కు మద్దతు!

బుధవారం, 9 ఏప్రియల్ 2014 (09:50 IST)
FILE
దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. వివిధ పార్టీల వారు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఈ ప్రచారంలో సినీతారల హడావుడిగా కూడా పెరిగిపోతోంది. సినీతారలతో తమ పార్టీ తరఫున ప్రచారం చేసుకుని ఓట్లు రాబట్టుకోవాలని కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే తాజాగా అలనాటి తార అతిలోక సుందరి 'శ్రీదేవి' ఎన్నికల ప్రచారంలో పాల్గొని సందడి చేసింది.

ఉత్తర ప్రదేశ్‌లోని ఫతేపూర్‌ సిక్రీ నుంచి ఆర్‌ఎల్‌డీ (రాష్ట్రీయ లోక్ దళ్) పార్టీనుంచి ఎంపీ అభ్యర్థిగా అమర్‌సింగ్‌ పోటీ చేస్తున్నారు. ఆయనకు బాలీవుడ్‌లోని పరిచయాలతో నటి శ్రీదేవి, భర్త బోనీకపూర్‌లను ప్రచారంలోకి దింపాడు. ఈ ప్రచారంలో భాగంగా శ్రీదేవి, బోనీ కపూర్‌తో కలిసి అమర్ సింగ్ కే మీ ఓటు అంటూ సుమారు ఐదుగంటలపాటు ప్రచారంలో పాల్గొంది.

మరికొంత మంది ప్రముఖ సినీ తారలను రంగంలోకి దింపి ఎన్నికల ప్రచారాన్ని ఊపు తీసుకు రావాలని అమర్ సింగ్ భావిస్తున్నట్లు సమాచారం. మరి అమర్‌సింగ్‌‌కు శ్రీదేవి ప్రచారం ఏమేరకు లబ్ది చేకూరుస్తుందో వేచి చూడాలి.

వెబ్దునియా పై చదవండి