ఘనంగా ఇందిరా గాంధీ జయంతి ఉత్సవాలు

భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ 92వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇందిర చేసిన సేవలను స్మరించుకుంటూ జయంతి వేడుకలను జరుపుకుంటున్నారు.

దేశ రాజధానిలోని యమునా నదీ తీరంలో శక్తి స్థల్ వద్ద ఇందిరా గాంధీని స్మరించుకునేందుకు వచ్చే సందర్శకులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఉక్కు మహిళగా పేరుగాంచిన శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి వేడుకల సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి కృష్ణ తీర్థ మాట్లాడుతూ... స్వర్గీయ ఇందిరా గాంధీ మహిళా సాధికారితకోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆమె పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరిగిందన్నారు.

ఇందిరా గాంధీ స్మృత్యర్థం దేశ వ్యాప్తంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి