టేకాఫ్ సమయంలో డోర్ పట్టుకుని కిందపడ్డ ఎయిర్ హోస్టెస్...

సోమవారం, 15 అక్టోబరు 2018 (13:57 IST)
ఎయిర్ హోస్టెస్ విమానం డోర్ వేసే క్రమంలో కిందపడిన ఘటన ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి, న్యూఢిల్లీకి ఏఐ 864 విమానం బయలుదేరబోతోంది. టేకాఫ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో ఎయిర్ హోస్టెస్ విమానం డోర్‌ను వేసి లాక్ చేయబోతుండగా ప్రమాదవశాత్తూ ఆ డోర్ తెరుచుకుని ఆమె క్రిందపడిపోయింది.
 
ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీనితో ఆమెను సమీపంలోని నానావతి హాస్పిటల్‌కు తరలించినట్లు విమానయాన వర్గాలు తెలిపాయి. ఐతే దీనిపై ఎయిర్ ఇండియా మాత్రం స్పందిచలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు