పుట్టి ఎనిమిది నెలలే అయిన ఆడ శిశువుపై 28 ఏళ్ల కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎనిమిది నెలల చిన్నారిని.. ఆ శిశువు తల్లిదండ్రులు 28 ఏళ్ల ఓ వ్యక్తి పర్యవేక్షణలో వుంచి ఉద్యోగాలకు వెళ్లేవారు. అయితే చిన్నారిని వదిలిపెట్టి తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లాక.. ఆ కామాంధుడు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో చిన్నారి జననాంగంలో రక్రస్రావం కావడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారికి చికిత్స అందించిన వైద్యులు పాపపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు.
చిన్నారి నోటికి గుడ్డకట్టి ఆ కామాంధుడు అత్యాచారానికి పాల్పడటంతో.. బాధితురాలైన పాప శ్వాస తీసుకోవడానికి శ్రమిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికే చిన్నారికి శస్త్రచికిత్స చేశామని, అయినప్పటికీ చిన్నారి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కామాంధుడిని అరెస్ట్ చేశారు.