ఈ క్రమంలో నవంబర్ 1న కణితులు తొలగించేందుకు సీనియర్ డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేస్తున్న డాక్టర్లు లోపల కనిపించిన దృశ్యం చూసి షాకవుతున్నారు. అయితే కణితులు సరిగా అభివృద్ధి చెందని పిండాలని గుర్తించారు. అంతే సీనియర్ డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. అలా గంటన్నరపాటు ఆపరేషన్ చేసి ఆ పిండాలను తొలగించారు.