18 యేళ్ళ యువతి. లోక జ్ఞానం పెద్దగా తెలియని అమాయకురాలు. ఎవరు ఏది చెప్పినా నమ్మేసే తత్వం. అదే ఆమె పాలిట శాపంగా మారింది. ఇంటర్ చదువుతున్న ఆ యువతి ఒక మాయగాడి వలలో పడింది. ప్రేమ పేరుతో నాలుగు నెలల పాటు ఆమెతో పిచ్చాపాటీ మాట్లాడిన యువకుడు బాగా నమ్మించాడు. నగ్నంగా నిన్ను చూడాలంటూ వీడియో కాల్ చేయమని ప్రాథేయపడి చివరకు ఆ యువతిని నగ్నంగా చూశాడు.
నమ్మక్కల్ జిల్లా రాశీపురం సమీపంలోని రమ్యకు కుమార్తె, కుమారుడు ఉన్నాడు. అనారోగ్యం కారణంగా సంవత్సరం క్రితమే భర్త చనిపోయాడు. ఇంటర్ చదువుతున్న రమ్య కుమార్తె కరోనా కారణంగా ఆన్ లైన్ క్లాసులను ఫోన్ లోనే వింటోంది. దీంతో ఒక స్మార్ట్ ఫోన్‌ను తల్లి తీసిచ్చింది.
ఆ తరువాత ఆ ఫోటోలు, వీడియోలను యువతి తల్లికే పంపించాడు. అంతటితో ఆగలేదు. రమ్యను కూడా నగ్నంగా ఫోన్ ముందు నిలబడమన్నాడు. దీంతో రమ్య తన కుమారుడిని వెంట పెట్టుకుని నేరుగా ఎస్పీని కలిసింది. వెంటనే స్పందించిన ఎస్పీ నిందితుడిని పట్టుకోవాలని ఆదేశించాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.