ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు అవినీతి మంత్రులపై వేటుపడింది. వీరిలో మైనింగ్‌శాఖ మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతి, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి రాజ్‌కిషోర్ సింగ్‌లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉద్వాసన పలికారు. యూపీలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో మైనింగ్‌శాఖ మంత్రిపై వేటుపడింది.
అక్రమ మైనింగ్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ హైకోర్టు జూలై 28వ తేదీన ఆదేశాలు జారీచేసింది. అయితే, సీబీఐ దర్యాప్తు ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ అఖిలేశ్ సర్కార్ చేసిన అభ్యర్థనను కొట్టిపారేసింది. ఈనేపథ్యంలో అక్రమ మైనింగ్‌ను ప్రమోట్ చేస్తున్న మంత్రి గాయత్రి ప్రజాపతిపై సీఎం గుర్రుగా ఉన్నారని, అందుకే ఆయనపై సీఎం వేటు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.