కొంగొత్త ఆశలతో 2023కు స్వాగతం.. శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్లు - సీఎంలు

ఆదివారం, 1 జనవరి 2023 (13:22 IST)
మరో కొత్త సంవత్సరం వచ్చేసింది. 2022కు వీడ్కోలు చెప్పేసి కొంగొత్త సంవత్సరం 2023లోకి ఎంట్రీ ఇచ్చేశాం. ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకల్లో నిమగ్నమైంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులుతు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై, కె.చంద్రశేఖర్ రెడ్డిలు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సలం ప్రతి ఇంటిలో ఆనందాలను నింపాలని, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ఆకాక్షించారు కొత్త సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సీఎంలు సూచించారు. 
 
ప్రజల జీవితాల్లో అన్ని రంగాల్లో గుణాత్మక ప్రగతికి నూతన సంవత్సరం బాటలు వేయాలని అభిలభించారు. 2023 సంవత్సరంలో సరికొత్త ఆశలు, లక్ష్యాలతో ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు