కుక్ కుమార్తెతో రాసలీలలు.. నిలదీసిన భార్య.. హోటల్ ఓనర్ సూసైడ్!
మంగళవారం, 30 మార్చి 2021 (16:38 IST)
తన వద్ద కుక్‌గా పని చేసే వ్యక్తి కుమార్తెతో హోటల్ యజమాని అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. ఈ విషయం భార్యకు తెలిసి నిలదీయడంతో ఆ హోటల్ యజమాని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగుళూరులోని బసవేశ్వర్ నగర్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బసవేశ్వర్‌నగర్ ప్రాంతంలోని కమలానగర్‌లో నాగరాజు అనే వ్యక్తి హోటల్ నిర్వహిస్తున్నాడు. తమ హోటల్‌లో పనిచేసే కుక్ కుమార్తె గౌరమ్మకు నాగరాజు దగ్గరయ్యాడు. వీరి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఈ వ్యవహారం కాస్తా నాగరాజు భార్యకు తెలియడంతో ఆయనను నిలదీసింది. దీంతో మనస్థాపం చెందిన నాగరాజు సీలింగ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బలవన్మరణానికి ముందు గౌరమ్మకు నాగరాజు వాయిస్ మెసేజ్‌లు పంపాడు.
మనశ్శాంతి కరువై జీవితం పట్ల విసుగెత్తి తనువు చాలిస్తున్నానని ఈ మెసేజ్‌ల్లో పేర్కొన్నాడు. నాగరాజు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని బెంగళూర్ పోలీసులు తెలిపారు.