బీహార్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రశ్నలేశారు. అమ్మాయి రేప్‌కు గురైందని ఎలా చెప్పగలరు? ఆ రక్తం ఎక్కడ నుంచి వచ్చింది అంటూ నీచమైన ప్రశ్నలు వేసి విసిగించాడు. తానే పోలీసు అవతారం ఎత్తి ఇంటరాగేషన్ చేపట్టిన ఆయన బీజేపీ మిత్ర పక్షమైన కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఎమ్మెల్యే లలన్ పాశ్వాన్నే. బీహార్‌లోని వైశాలీలో ప్రభుత్వ వసతిగృహంలో చదువుకునే ఓ పదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఆమె దుస్తులు రక్తంలో తడిసిపోయాయి.