కావేరీ మంటలు : చెన్నైలో కర్నాటక హోటల్స్‌పై ఆందోళనకారుల దాడులు

సోమవారం, 12 సెప్టెంబరు 2016 (12:07 IST)
కావేరీ జల వివాదం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టింది. ఫలితంగా ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే, ఇరు రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలు స్తంభించిపోయాయి.
 
మరోవైపు కర్నాటకలో ఆందోళనకారులు మరింత రెచ్చిపోతున్నారు. ఆ రాష్ట్రంలో నివశించే తమిళ ప్రజలపై, వారి ఆస్తులపై దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడులు ఇరు రాష్ట్రాల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులను కల్పిస్తున్నాయి. 
 
తాజాగా చెన్నైలోని కర్నాటక రాష్ట్రానికి చెందిన ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. చెన్నై, మైలాపూర్‌లోని ఉడ్‌ల్యాండ్స్ హోటల్స్‌లోకి ఆందోళనకారులు చొరబడి, ఫర్నీచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. అలాగే, కర్నాటక రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలపై కూడా దాడులకు తెగబడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి