పచౌరీపై ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన కేసు విచారణ ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సాగుతున్న విషయం తెల్సిందే. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటును పరిశీలించిన మేజిస్ట్రేట్ శివానీ చౌహాన్... పచౌరికి వ్యతిరేకంగా కేసు విచారణను ముందుకు సాగించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ తదుపరి విచారణను జూలై 11వ తేదీకి వాయిదా వేశారు.
కాగా గత 2015లో ఆర్కే పచౌరి.. ఇంధన వనరుల పరిశోధన సంస్థ (టెరి) అధిపతిగా ఉన్నప్పుడు ఆ సంస్థలోని ఓ మహిళా ఉద్యోగినిపై దాడి చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడే ఉద్దేశంతో ఆమెను వెంటాడాడని, ఆమె పరువుకు భంగం కలింగించేలా వ్యవహరించాడని ఐపీసీ సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు అభియోగాలు నమోదుచేసిన విషయం తెల్సిందే.