తీవ్ర తుఫానుగా బిపర్ జోయ్.. 145 కిలోమీటర్ల వేగంతో గాలులు
శనివారం, 10 జూన్ 2023 (11:46 IST)
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జోయ్ తుపాను మరో 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారబోతోందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్, గుజరాత్, కేరళ రాష్ట్రాలకు ఐఎండీ అలెర్ట్ ప్రకటించింది.
తుఫాను ఉత్తర, ఈశాన్య దిక్కుగా తుఫాను కదులుతోందని తెలిపింది. తుపాను కేంద్రీకృతమైన ప్రాంతంలో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వెల్లడించింది.
మరోవైపు తుపాను నేపథ్యంలో గుజరాత్ లోని ప్రఖ్యాత టూరిస్ట్ డెస్టినేషన్ అయిన వల్సాద్‌లోని తిథాల్ బీచ్‌ను ఈ నెల 14 వరకు మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని, సముద్రంలోకి వెళ్లిన వారు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.