ఫాదర్స్ డే.. పెద్దమనిషి విమానంలో మహిళను వేధించాడు.. బయటకు చెప్పుకోని రీతిలో ప్యాంటుకు?

ఆదివారం, 18 జూన్ 2017 (15:06 IST)
ఫాదర్స్ డే రోజున తండ్రి వయసున్న ఓ పెద్దమనిషి పక్కసీట్లోని మహిళపై వేధింపులకు దిగిన ఘటన ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో చోటుచేసుకుంది. రెండు గంటల  ప్రయాణంలోనే పెద్దమనిషిననే విషయాన్ని మరిచిపోయి.. మహిళను వేధించాడు. 
 
వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఇండిగో విమానంలో ఢిల్లీలోని రోహిణీ ప్రాంతానికి చెందిన రమేష్ చంద్ (56) అనే వ్యక్తి ప్రయాణిస్తున్నారు. పక్కసీట్లో ఒక మహిళ కూర్చున్నారు. రమేష్ చంద్ ఆమెను తాకేందుకు ప్రయత్నించాడు. 
 
అతని ప్యాంటుకు జిప్ వేయకుండా కూర్చుని బయటకు చెప్పుకోని రీతిలో ప్రవర్తించాడు. దీంతో కామ్‌గా ఎయిర్‌హోస్టెస్‌ను పిలిచి.. సీటు మార్పించుకుంది. ఆపై విమానం ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌‌లో ల్యాండ్ కాగానే ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన సమాచారంతో ఆ పెద్దమనిషిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీ సెక్షన్లు 354, 354ఎ, 509 కింద కేసులు నమోదు చేశారు.  

వెబ్దునియా పై చదవండి