అలాగే, ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించే విషయంపై కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. దీంతో రైతులు తమ ఉద్యమాన్ని విరమించుకున్నారు. శనివారం నుంచి విజయ కవాతుతో తమ స్వస్థలాలకు రైతులు ఉద్యమ ప్రాంతాన్ని వీడి తమ స్వస్థలాలకు వెళ్లనున్నారు.
కేంద్రం తెచ్చిన మూడు వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు మహోద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇది యేడాదిన్నరగా సాగుతూ వచ్చింది. రైతుల ఉద్యమంతో పాటు ఇటీవల వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చావుదెబ్బతిన్నది. దీంతో దిగివచ్చిన కేంద్రం సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రటించారు.
ఆ తర్వాత ఈ చట్టాల రద్దుపై పార్లమెంట్లోనూ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించింది. ఇపుడు రైతుల డిమాండ్ల పరిష్కారానికి కూడా కేంద్రం సమ్మతించింది. అలాగే, ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు పరిహారం అందజేసేందుకు కూడా ఉత్తరప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు సమ్మతించాయి. దీంతో ఉద్యమాన్ని విరమించుకుంటున్నట్టు ప్రకటించారు.
కానీ, డిమాండ్ల పరిష్కారంలో మార్గం ప్రభుత్వాలు వెనకడుగు వేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఫలితంగా శనివారం నుంచి రైతులు తమతమ స్వస్థలాలకు వెళ్లనున్నారు. విజయ కవాతుతో రైతులు తమ ఊర్లకు వెళుతారని రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ వెల్లడించారు. రైతులు చారిత్రాత్మక విజయాన్ని సాధించారన్నారు.