పైలట్ తప్పిదం వల్ల విమానంలోని ప్రయాణికులతో పాటు.. భద్రతా సిబ్బంది కొన్ని నిమిషాల పాటు భయంతో వణికిపోయారు. ముఖ్యంగా, విమానం హైజాక్ అయిందన్న అనుమానంతో వారికి ముచ్చెమటలు పోశాయి. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు అధికారులు స్పందిస్తూ, ఢిల్లీ నుంచి కాందహార్‌కు వెళ్లే ఎఫ్.జి.-312 విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. అపుడు సరిగ్గా సమయం 3 గంటల 30 నిమిషాలు. ఆ సమయంలో విమానంలో 124 మంది ప్రయాణికులు, సిబ్బంది సహా 133మంది ఉన్నారు.