శభాష్ ఐటీబీపీ... 18 వేల అడుగుల ఎత్తు... -25 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఏం చేశారో చూడండి... (Video)

బుధవారం, 21 జూన్ 2017 (14:31 IST)
అంతర్జాతీయ యోగా దినోత్సవం బుధవారం ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. దీన్ని పురస్కరించుకుని ప్రపంచ దేశాధినేతలు సైతం యోగాసనాలు వేశారు. అలాగే, లడక్‌లో ఐటీబీపీ (ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్) జవాన్లు యోగాసనాలు వేశారు. లడక్‌లోని 18 వేల అడుగుల ఎత్తైన ప్రదేశంలో -25 డిగ్రీల ఉష్ణోగ్రతలో జవాన్లు యోగసనాలు వేసి.. యోగా ప్రాధాన్యతని దేశ ప్రజలకు తెలియజేశారు.
 
గతేడాది కూడా ఆర్మీ జవాన్లు 20 వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ గ్లేసియర్ వద్ద యోగసనాలు వేసిన విషయం తెలిసిందే. మరోవైపు పెరూలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చారిత్రక కట్టడం మచు పిఛూ వద్ద మూడో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 
 
మరోవైపు... ప్ర‌పంచ అత్యంత వృద్ధ యోగా టీచ‌ర్ టావో పోర్చ‌న్ లించ్‌, భార‌త‌దేశ అత్యంత వృద్ధ యోగాభ్యాస‌కురాలు అమ్మా నాన్న‌మాల్ బెంగుళూరులో ఆస‌నాలు వేసి అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నారు. ఈ యోగా కార్య‌క్ర‌మంలో ప్ర‌పంచ వృద్ధ మ‌హిళా టీచ‌ర్లు యోగాస‌నాలు వేసి ఆరోగ్య సూత్రాల‌ను వెల్ల‌డించారు. కంఠీర‌వ స్టేడియంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. సామాజిక కార్య‌క‌ర్త అన్నా హ‌జారే, కేంద్ర మంత్రి అనంత్ కుమార్‌లు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 

 

ITBP jawans doing #Yoga at nearly 18000 feet in Ladakh in -25 degrees!! #InternationalYogaDay pic.twitter.com/dvWmu4sV5k

— Republic Of India (@RepubIicofIndia) June 21, 2017

వెబ్దునియా పై చదవండి