జార్ఖండ్ రోప్‌వేలో మరో ప్రమాదం.. తాడుకు వేలాడుతూ కనిపించిన వ్యక్తి...

మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (13:11 IST)
Rope Way
జార్ఖండ్ రోప్‌వేలో ప్రమాద స్థలంలో అపశృతి చోటుచేసుకుంది. ఆదివారం రోప్‌వేలోని కేబుల్ కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.  
 
తాజాగా జార్ఖండ్ రోప్ వేలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌కు చెందిన ఓ వ్యక్తిని భారత వైమానిక దళం హెలికాప్టర్‌లోకి లాగేందుకు ప్రయత్నించింది. 
 
ఆ క్షణంలో ఏమైందో ఏమో.. హెలికాప్టర్ వరకు చేరుకున్న తర్వాత అతడు తాడుకు వేలాడుతూ కనిపించాడు. హెలికాప్టర్‌లో ఉన్న జవాన్లు అతడిని పైకి లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. కొన్ని సెకన్ల తర్వాత ఆ వ్యక్తి హెలికాప్టర్‌పై నుంచి లోయలో పడిపోయాడు.
 
అతడు హెలికాప్టర్‌లోకి చేరుకొనే సమయంలో ఛాపర్ బ్లేడ్‌ల నుంచి వేగం వీస్తున్న గాలిని ఎదుర్కోడానికి ఇబ్బందిపడినట్లు కనిపించింది. సరిగ్గా హెలికాప్టర్‌లోకి వెళ్తున్నాడు అని భావించే సమయానికి అతడు అకస్మాత్తుగా అంత ఎత్తు నుంచి కిందకు పడిపోయాడు.
 
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాపం, ప్రాణాలతో బయటపడతాడని భావిస్తే.. ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయాడని నెటిజన్లు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.

#Deoghar tragedy - one killed while rescue #DeogharRopewayAccident pic.twitter.com/j0i7RvRUyS

— Amit Shukla (@amitshukla29) April 11, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు