విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐ చేసిన టిక్‌టాక్ వీడియో ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా వైరల్‌గా మారింది. అంతేకాదు సోషల్ మీడియా ట్రెండింగ్‌లో కూడా ప్రథమస్థానానికి చేరింది. యూత్‌ని విపరీతంగా ఆకట్టుకున్న ఈ యాప్ పోలీసు అధికారులను సైతం ఆకర్షించింది. కొద్ది రోజుల క్రితం చెన్నై సెయింట్ థామస్ మౌంట్ సాయుధ దళం డిప్యూటీ కమీషనర్ ఒకరు టిక్‌టాక్‌లో పాటపాడి అదరగొట్టారు.
తాజాగా విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ, మరొక మహిళా ఎస్ఐతో కాదల్ పరిసు చిత్రంలోని కాదల్ మగరాణి అనే పాట పాడుతూ చేసిన టిక్‌టాక్ వీడియో సంచలనంగా మారింది. ఈ టిక్‌టాక్ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో ఉంది. కాగా ఇటీవలే తమిళనాడు డీజీపీ రాజేంద్రన్ పోలీసుల సెల్‌ఫోన్ వినియోగంపై ఆంక్షలు విధించారు.