ఈ వివరాలను పరిశీలిస్తే, "శిఖర" : అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ కశ్మీరీ పండిట్స్ అనే హిందీ విడుదల కాగా, దాన్ని అద్వానీ కోసం ప్రత్యేక స్క్రీనింగ్ వేశారు ఈ చిత్రాన్ని చూస్తూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఎంతో ఉద్వేగంతో కూడుకున్న ఈ చిత్రాన్ని చూస్తూ ఈ బీజేపీ వృద్ధనేత కన్నీరు పెట్టుకుంటుండగా, చిత్ర దర్శకుడు వినోద్ చోప్రా ఆయన దగ్గరకి వెళ్లి ఓదార్చుతారు.
ఇందుకు సంబంధించిన వీడియోని ఇటీవల విదు వినోద్ చోప్రా ఫిలిమ్స్ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. 1990లో కాశ్మీర్ పండిట్లపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో వారు ఇళ్లని వదిలిపోయారు. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి ఎంతగానో కనెక్ట అయింది. ఆదిల్ ఖాన్, సాదియా ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ చిత్ర ఫిబ్రవరి 7న విడుదలైంది.