వ్యభిచారంపై బాంబే హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. వ్యభిచారం క్రిమినల్ నేరం కిందకు రాదని స్పష్టం చేసింది. అయితే, ఎవరినైనా లైంగికంగా ప్రేరేపించడం, వ్యభిచార గృహాన్ని నిర్వహించడం వంటివి మాత్రం నేరమని తన తీర్పులో పేర్కొంది.
ఈ నేపథ్యంలో తన తీర్పును వెలువరించిన కోర్టు... ముగ్గురు మహిళలను విడుదల చేయాలని ఆదేశించింది. ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ 1956 కింద వ్యభిచారం క్రిమినల్ కేసు కాదని తెలిపింది. పైగా, తన వృత్తిని ఎంచుకునే స్వేచ్ఛ మహిళకు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.