సమంతకు మినహాయింపు... ఆమె ఫోటోలు లీక్ చేయను : గాయని సుచిత్ర

శుక్రవారం, 10 మార్చి 2017 (14:18 IST)
దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను బహిర్గతం చేసి సంచలనం రేపిన తమిళ గాయని సుచిత్రా తాజాగా ఓ విషయాన్ని వెల్లడించింది. హీరోయిన్ సమంత - సిద్ధార్థ్ ఫోటోలను మాత్రం బహిర్గతం చేయబోనని స్పష్టం చేసింది. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో పలువురు నటీనటుల ప్రైవేట్ ఫొటోలను, వీడియోలను సుచిత్ర పోస్ట్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్ప‌టికే ఎంద‌రో హీరోయిన్‌ల ఫొటోల‌ను బ‌య‌ట‌పెట్టిన సుచిత్ర ఇక స‌మంతకు సంబంధించిన ఫొటోల‌ను బ‌య‌ట‌పెట్ట‌నుంద‌ని వార్త‌లు గుప్పుమంటున్నాయి కూడా. వీటిలో సమంత - సిద్ధార్థ్ ఫోటోలు కూడా ఉన్నట్టు సమాచారం.
 
దీంతో అటు సమంతతో పాటు ఇటు ఆమె ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సుచిత్ర వారికి ఊరట కలిగించే వార్తను వెల్లడించింది. సమంత విషయంలో ఎలాంటి లీకులూ లేవని చెప్పింది. ఆమె ఫొటోలు కానీ వీడియోలు కానీ విడుద‌ల చేయ‌బోన‌ని పేర్కొంది. దీంతో స‌మంత అభిమానులు ఊపిరిపీల్చుకుంటున్నారు. కాగా, గతంలో సమంత - హీరో సిద్ధార్థ్‌లు ప్రేమలో మునిగితేలినట్టు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి