కర్నాటకలో తమిళులపై దాడులు.. 15న తమిళనాడు రాష్ట్ర బంద్

బుధవారం, 14 సెప్టెంబరు 2016 (15:15 IST)
కావేరీ జలాల వివాదాన్ని అడ్డుపెట్టుకుని కర్నాటకలోని పలు ప్రాంతాల్లో తమిళులపై జరిగిన దాడులకు నిరసనగా ఈనెల 15వ తేదీన తమిళనాడు రాష్ట్ర వ్యాప్త బంద్‌ను పాటించనున్నారు. ఈ మేరకు తమిళనాడు వ్యవసాయ సంయుక్త కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది.
 
తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య కావేరీ జల వివాదం పెను వివాదాస్పదంగా మారిన విషయం తెల్సిందే. ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని కర్నాటకలో తమిళులపై దాడులు కూడా జరిగాయి. వందల సంఖ్యలో వాహనాలకు నిప్పుపెట్టారు. అలాగే, పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడులకు నిరసనగా బుధవారం తమిళనాడు బంద్‌కు పిలుపు ఇచ్చాయి. 
 
అదేసమయంలో చెన్నైలో కర్నాటకకు చెందిన 171 ఆఫీసులు, 68 హోటల్లు, 66 బ్యాంకుల దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కర్నాటక - తమిళనాడు సరిహద్దు దగ్గర వాహనాలను నిలిపివేస్తున్నారు. మరోవైపు... కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాలని డీఎంకే అధినేత కరుణానిధి డిమాండ్‌ చేశారు. 

వెబ్దునియా పై చదవండి