అన్ లాక్ 1.O పరిస్థితి ఏంటి..? జూన్ 8 నుంచి జాగ్రత్త.. లేకుంటే..?

శుక్రవారం, 5 జూన్ 2020 (12:12 IST)
కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తోంది. లాక్ డౌన్ ఆంక్షల మధ్య కరోనాను కట్టడి చేయడంలో సఫలమైనా.. ప్రస్తుతం అన్ లాక్ 1.Oలో పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ.. ఆందోళన మొదలైంది. ఆంక్షలు సడలించినప్పటి నుంచి కేసుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. దేశంలో రోజుకు కేసుల సంఖ్య 8వేలు దాటిపోయింది. మొత్తం పాజిటీవ్ కేసులు లక్షా 90వేలు దాటాయి.  
 
అంతేగాకుండా మున్ముందు కరోనా కేసులు మరింతగా పెరిగే ప్రమాదం ఉందని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత దేశంలో కరోనా వ్యాప్తి రేటు గణనీయంగా పెరిగింది. ప్రజా రవాణాను అనుమతించడం, షాపులు తెరవడం, ప్రజల కదలికలపై ఆంక్షలు ఎత్తేయడం వల్లే భారత్‌లో కరోనా సామాజిక వ్యాప్తి దశకు వస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
 
అయితే పెరుగుతున్న కేసుల దృష్ట్యా వీటిపై పునరాలోచనలో ఉన్నట్టు సమాచారం. గతంలో కూడా లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు అనుమతులిచ్చినట్టే ఇచ్చి.. వెనువెంటనే కరోనా భయంతో వాటిని నిలిపివేసింది కేంద్రం. లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేసి, ఇప్పుడు చేతులెత్తేసిందని ఈపాటికే కేంద్రం అప్రతిష్ట మూటగట్టుకుంటోంది. 
 
ఈ నేపథ్యంలో మరో సాహసానికి కేంద్రం పూనుకుంటుందా.. అన్ లాక్ నిబంధనలతో కేసులు తగ్గుతాయా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. దీంతో జూన్ 8వ తేదీ నుంచి ప్రజలు అప్రమత్తంగా వుండాలని.. మాస్కులు, సామాజిక దూరం పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లేకుంటే కరోనా కేసులు పెరగక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు