#ElectionResults : ఉత్తరప్రదేశ్ - ఉత్తరాఖండ్‌లలో బీజేపీ ముందంజ... పంజాబ్‌లో కాంగ్రెస్ - ఆప్

శనివారం, 11 మార్చి 2017 (09:06 IST)
ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం మొదలైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో దూసుకెళుతోంది. పంజాబ్‌లో కాంగ్రెస్- ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మణిపూర్‌లో కాంగ్రెస్- బీజేపీలు నువ్వానేనా అన్న రీతిలో పోటీ సాగుతోంది. గోవాలో 2 స్థానాలతో బీజేపీ ముందుంది. 
 
కాగా, ఉదయం 9 గంటలకు వెల్లడైన ట్రెండ్ మేరకు.. యూపీలో 128 చోట్ల బీజేపీ, ఎస్పీ - కాంగ్రెస్ కూటమి 33 స్థానాల్లో, బీఎస్పీ 23, ఇతరులు మూడు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే, పంజాబ్‌లో కాంగ్రెస్ 19 చోట్ల, ఆప్ 12 చోట్ల, బీజేపీ 5 చోట్ల ఆధిక్యంలో ఉంది. 
 
ఉత్తరాఖండ్‌లోబీజేపీ 19, కాంగ్రెస్ 10 స్థానాల్లో ఆధికంలో ఉండగా, గోవాలో బీజేపీ 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే, మణిపూర్‌లో కాంగ్రెస్ 5 చోట్ల, బీజేపీ 3 చోట్ల, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
 
మరోవైపు... యూపీలోని 75 జిల్లాల్లో 78 కౌంటింగ్‌ కేంద్రాలు, పంజాబ్‌లో 27 ప్రాంతాల్లోని 54 కేంద్రాలు, ఉత్తరాఖండ్‌లో 15 కేంద్రాలు, గోవాలో రెండు కేంద్రాల్లో కౌంటింగ్‌ జరగనుంది. ఎలాంటి అల్లర్లు జరగకుండా ఆయా కేంద్రాల వద్ద వేల సంఖ్యలో కేంద్ర భద్రతా బలగాలు మోహరించాయి. 

వెబ్దునియా పై చదవండి