2010-11 సంవత్సర బడ్జెట్ అంచనా ఇదీ..!

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో బడ్జెట్ అంచనా కింది విధంగా ఉంది. మొత్తం వ్యయం రూ.11,08,749 కోట్లు కాగా, ప్రణాళికా వ్యయం రూ.3,73,092 కోట్లుగా ఉంది.

ఇకపోతే.. ప్రణాళికేతర వ్యయం రూ.7,35,657 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.1,48,650 కోట్లు, ద్రవ్యలోటు అంచనా 5.5 శాతంగా పేర్కొన్నారు. అంతేకాకుండా 2008-09 సంవత్సరంలో ద్రవ్యలోటు 7.8 శాతంగా ఉండగా, ఇది 2009-10 సంవత్సరంలో 6.9 శాతానికి చేరుకుంది. 2010-11 సంవత్సరంలో 5.5 శాతాన్ని లక్ష్యంగా ఉంచుకున్నారు.

వెబ్దునియా పై చదవండి