రిల్ ఛైర్మన్ ముఖేష్ అంబానీకి "గ్లోబల్ విజన్ అవార్డు"

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ అవార్డుల ఖాతాలో తాజాగా మరొకటి చేరింది. ఆసియా సొసైటీ న్యూయార్క్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకు "గ్లోబల్ విజన్ అవార్డు"ను ప్రధానం చేసింది. ఆసియా, అమెరికన్ల మధ్య అవగాహన పెంచడానికి అంబానీ చేసిన కృషికి గుర్తింపుగా ఆసియా సొసైటీ ఈ అవార్డును అందించింది.

ఈ సందర్భంగా అంబానీ మాట్లాడుతూ.. 1980 దశకంలో వర్థమాన దేశంగా ఉన్న ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే మూడో కీలకమైన ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందిందని చెప్పారు. 21వ శతాబ్దంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనున్నదని ఆయన అన్నారు.

ఈ అభివృద్ధిలో తాము కూడా భాగస్వామి కావడం ఆనందదాయకమని అంబానీ ఈ అవార్డు అందుకున్నసందర్భంగా అన్నారు. అలాగే.. జనరల్ ఎలక్ట్రిక్ ఛైర్మన్ సీఈఓ జెఫ్రీ ఇమ్మెట్‌కి గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు లభించింది.

వెబ్దునియా పై చదవండి