వాటా కొనుగోలుకు మేము రెడీ..: ఫ్రభుత్వానిదే లేటు

కెయిర్న్ ఇండియాలో వాటా కొనుగోలుకు రంగం సిద్ధం చేసినట్లు వేదాంత వెల్లడించింది. ఈ మేరకు ప్రతిపాదిత 60 శాతం వాటా కొనుగోలుకు 6 బిలియన్ డాలర్ల నిధులను సిద్ధం చేసినట్లు కంపెనీ తెలిపింది. ఇందుకు గానూ.. మొత్తం ఎనిమిది అంతర్జాతీయ బ్యాంకుల కన్సార్షియంతో ఫైనాన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

కాగా, కెయిర్న్-వేదాంత డీల్‌కు అనుమతిపై నిర్ణయం తీసుకోవాలంటే, కెయిర్న్ ఎనర్జీ దేశంలో తనకున్న 10 చమురు-గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి నియంత్రణ హక్కుల బదిలీ కోసం ముందుగా తమకు దరఖాస్తు చేయాల్సిందేనని చమురు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో ఈ ఒప్పందానికి ప్రభుత్వ అనుమతులు జనవరి-ఫిబ్రవరి దాకా జాప్యం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి