పెట్టుబడులకు అనుకూలం కాదు : సింగపూర్ ప్రధాని

గురువారం, 12 జులై 2012 (12:53 IST)
మందగించిన వృద్ధిరేటుతోపాటు.. ఆర్థిక సంస్కరణలు ఆటకెక్కడం, ప్రపంచ ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో భారత్ పెట్టుబడులకు అనుకూలంగా లేదని సింగపూర్ ప్రధానమంత్రి లీ హైసన్ లూంగ్ అన్నారు. ఢిల్లీలో సీఐఐ, ఫిక్కి, అసోచామ్ కలిసిన నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా లీ మాట్లాడుతూ పెట్టుబడిదారులకు సరైన వాతావరణం కల్పించినప్పుడే వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారన్నారు. కానీ, ప్రస్తుతం భారత్‌లో ఈ పరిస్థితి కనబడటం లేదన్నారు. త్వరలో అమలు పరుచనున్న గార్ నిబంధనలకు అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఆందోళన చేందుతున్నారని గుర్తు చేశారు.

అమెరికా, బ్రిటన్ దేశాలతో పోల్చుకుంటే సింగపూర్‌లో కార్పొరేట్ పన్నులు చాలా తక్కువగా ఉండటంతో నాలుగు వేల భారత్ కంపెనీలు అక్కడ వ్యాపారం నిర్వహిస్తున్నాయని చెప్పారు. అలాగే భారత్ నుంచి సింగపూర్‌ను సందర్శించే వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో విమాన సర్వీసుల సంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి