సామాన్యుడు విలవిల: 62 శాతం పెరిగిన కూరగాయల ధరలు!

దేశంలో కూరగాయల ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఉల్లి ధరలతో సహా మిగిలిన అన్ని కూరగాయలు ప్రియం కావడంతో నవంబరు నెలకు వినియోగ ద్రవ్యోల్బణం 11.24 శాతానికి చేరింది. ఇది తొమ్మిది నెలల గరిష్ఠ స్థాయి. కాగా అక్టోబరు నెల వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం 10.17 శాతానికి సవరించారు.

తాత్కాలికంగా లెక్కించినపుడు ఇది 10.09 శాతమంది ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే నవంబరు నెలకు కూరగాయల ధరలు 61.6 శాతం పెరిగాయి. క్రితం నెలలో ఈ పెరుగుదల రేటు 45.67 శాతం ఉందని గురువారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి