మొబైల్లో ఇంటర్నెట్ వేగానికి ట్రాయ్ చర్యలు!

బుధవారం, 23 ఏప్రియల్ 2014 (14:57 IST)
మొబైల్లో ఇంటర్నెట్ వాడుతున్న వినియోగదారులకు శుభవార్త. సెల్‌ఫోన్‌లో ఇంటర్నెట్ వేగంపై ట్రాయ్ దృష్టి సారించింది. తక్కువ వేగంతో వినియోదారులకు ఇంటర్నెట్ సేవలను అందిస్తోన్న నెట్ వర్క్ ఆపరేట్లు కనీస డౌన్ లోడ్ వేగాన్ని పాటించాలని ట్రాయ్ ఆదేశించింది.

దీంతో ఆపరేటర్లు కచ్చితంగా వారు సూచించిన వేగానికి తగినట్లుగా ఇంటర్నెట్ సేవలను అందించాల్సి ఉంటుంది. అప్పుడు వినియోగదారులకు సౌకర్యంతోపాటు, ఆపరేటర్ల మోసానికి కూడా కళ్లెం పడుతుందన్నమాట. మొబైల్లో ఇంటర్నెట్ అతితక్కువ డౌన్‌లోడ్ పై ఫిర్యాదులు ఎక్కువవడంతో ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది.

వెబ్దునియా పై చదవండి