ఫేస్‌బుక్‌లో సీబీఎస్‌పీ ప్లస్ టూ ఫిజిక్స్ పేపర్ లీక్!

బుధవారం, 12 మార్చి 2014 (17:04 IST)
File
FILE
సామాజిక, వ్యక్తిగత అంశాలు పంచుకోవడానికి ప్రధాన వేదికగా ఉన్న సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌ను కొన్ని దుష్టశక్తులు అసాంఘిక చర్యలకూ ఉపయోగిస్తున్నారు. మణిపూర్ రాష్ట్రంలో సీబీఎస్ఈ ప్లస్ టు ఫిజిక్స్ ప్రశ్నాపత్రాన్నే ఫేస్‌బుక్‌లో పెట్టేశారు.

పరీక్షల ఆరంభానికి ఒకరోజు ముందే సదరు పేపర్ ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షమైంది. దీనిపై విద్యార్థులు మండిపడుతున్నారు. తాము రాత్రింబవళ్ళు చదవి పరీక్ష రాశామని కొందరు విద్యార్థులు వాపోయారు. పరీక్ష మరోసారి నిర్వహించాలని వారు పట్టుబడుతున్నారు. దీంతో మణిపూర్‌లోని అన్ని పాఠశాలల్లో రీ ఎగ్జామినేషన్ నిర్వహించేందుకు నిర్ణయించారు.

వెబ్దునియా పై చదవండి