రైలు ప్రయాణికుల భద్రతకు తూట్లు

FileFILE
దేశంలోని రైలు ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా మారింది. రైలు ఎక్కిన ప్రయాణికుడు.. సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకునేంత వరకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇందుకు నిదర్శనం... రాష్ట్రంలో ఇటీవల జరిగిన గౌతమి ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదం. గతంలో ఈ రైలును సికింద్రాబాద్‌లో తనిఖీ చేసేవారు.

ఈ తనిఖీలను ప్రస్తుతం కాకినాడకు మార్చారు. దీంతో సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరిన రైలును భద్రతా అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయలేదనే వాదనలు వినొస్తున్నాయి. అయితే.. అధికారులు మాత్రం తనిఖీ చేసినట్టుగా సర్టిఫికేట్ ఇచ్చారు. రిజర్వేషన్ ప్రయాణికుల నుంచి భద్రత పేరుతో రూ.20 వసూలు చేసే రైల్వే శాఖ.. వారి భద్రతకు మాత్రం ఒక్క రూపాయి కూడా వెచ్చిచ్చండం లేదు.

ప్రతి బోగీకి విధిగా ఒక సెక్యూరిటీ గార్డు నియమించాల్సి వుంది. అయితే... మన రైల్వే అధికారులు మాత్రం మూడు నాలుగు బోగీలకు కలిపి ఒకరినే నియమిస్తున్నారు. ఇలా.. రైలు ప్రయాణికుల భద్రతలో అన్ని లొసుగులే కనిపిస్తున్నాయి. ఈ లోసుగులే గౌతమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల ప్రాణాలు తీశాయి.

వెబ్దునియా పై చదవండి