మత్స్యదర్శినిని ప్రారంభించిన వైఎస్

రాష్ట్రంలోని మత్స్యకారులను ప్రోత్సహించేందుకుగాను ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రరాజధానిలో మత్స్యదర్శిని కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మత్స్యకారులు ఈ కేంద్రాన్ని వినియోగించుకోవాల్సిందిగా వైఎస్ కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్య శాఖా మంత్రి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ... చేపల వేటకెళ్లి మరణించినవారి కుటుంబాలకు ప్రభుత్వం లక్ష రూపాయల సహాయాన్ని అందిస్తుందనీ, మరో లక్ష రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ఇతర ప్రధాన పట్టణాల్లో మత్స్యదర్శిని కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. మేడ్చల్‌లో మత్స్యకారుల మహిళాగ్రూపులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్, కనిపించకుండా పోయిన జాలర్ల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున చెక్కులను అందించారు.

వెబ్దునియా పై చదవండి