తన మంత్రివర్గంలో ఎవరెవరు మంత్రులుగా ఉండాలని నిర్ణయించేది జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)లు కాదని తమ పార్టీ అధిష్టామని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. ప్రభుత్వ వ్యవహారాలు, మంత్రివర్గ కూర్పు, పాలనా వ్యవహారాల్లో జేఏసీలు చేసే హెచ్చరికలను సూచనలు పాటించే ప్రసక్తే లేదనే సంకేతాలను ఆయన పంపారు.
కొత్త మంత్రివర్గంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ మంత్రి పదవులను తీసుకోవద్దని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్‌లు ప్రకటించిన విషయం తెల్సిందే. వీరికి జతగా కేయూ, ఉస్మానియా జేఏసీలు సైతం ఇదే తరహా అభిప్రాయపాన్ని వ్యక్తం చేసింది.
దీనిపై ఢిల్లీలో మీడియా అడిగిన ప్రశ్నకు కిరణ్ కుమార్ స్పందిస్తూ.. ఉప ముఖ్యమంత్రి పదవి తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో ఎలాంటి మార్పు లేదు. మంత్రిపదవులు, డిప్యూటీ సీఎంలు తీసుకోవచ్చని తెలంగాణ జేఏసీలు చేస్తున్న హెచ్చరికలను పరిగణనలోకి తీసుకునే ప్రసక్తే లేదు. ఇలాంటి పనికిమాలిన హెచ్చరికలపై ప్రశ్నలు వేయవద్దని మీడియాకు విజ్ఞప్తి అని కిరణ్ కుమార్ ఘాటుగా వ్యాఖ్యనించారు.