కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా: వైఎస్.వివేకానంద స్పష్టీకరణ

తన సోదురుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి నడిపిన, చూపిన మార్గంలోనే కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని తాను నిర్ణయం తీసుకున్నట్టు ఎమ్మెల్సీ వైఎస్.వివేకానంద రెడ్డి ప్రకటించారు. తనకు రాజకీయ బాట వేసిన వైఎస్ఆర్ బాటలోనే గత 35 సంవత్సరాలుగా కొనసాగుతున్నట్టు, ఇకపై అదే మార్గంలో నడువనున్నట్టు తేల్చి చెప్పారు. మంగళవారం ఉదయం జగన్ రెడ్డితో భేటీ అయిన తర్వాత ఆయన కడప ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

ముఖ్యంగా.. జగన్ రాసిన ఐదు పేజీల బహిరంగ లేఖలో పేర్కొన్న కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడించి ఆరోపణలు చేయడం వల్లే మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని వివేకానంద రెడ్డి చెప్పారు. ఢిల్లీకి తనను ఎవరూ ఆహ్వానించలేదన్నారు. సీఎల్పీ సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ పెద్దల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్‌తో రాష్ట్ర పరిస్థితులపై మాట్లాడినట్టు చెప్పారు. ఆ తర్వాత వీరప్ప మొయిలీ, ముఖ్యమంత్రిని కలుసుకునేందుకు ఢిల్లీకి వెళ్లినట్టు చెప్పారు.

ఆ తర్వాత తనంతతానుగా ఢిల్లీకి వెళ్లినట్టు చెప్పారు. ఢిల్లీకి వెళ్లింది కూడా మంత్రి పదవి కోసం కాదన్నారు. ఒకవేళ మీరంతా భావిస్తే తనను క్షమించాలన్నారు. పైపెచ్చు.. జగన్‌తో భేటీ సమయంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశానన్నారు. ముఖ్యంగా, తమ కుటుంబాన్ని చీల్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం కుట్ర పన్నినట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇందులో అధిష్టానం పాత్ర ఎంతమాత్రం లేదన్నారు.

వెబ్దునియా పై చదవండి