మంత్రి, ఎమ్మెల్యే పదవికి వట్టి వసంత కుమార్ రాజీనామా!!
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు కూడా పూర్తికాకముందే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం నుంచి ఒక వికెట్ పడిపోయింది. మంత్రిత్వశాఖ కేటాయింపులో తనకు ప్రాధాన్యత లేని శాఖను కేటాయించినందుకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు శాసనసభ సభ్యుడు వట్టి వసంతకుమార్ తన పదవికి రీజానామా చేశారు. పనిలోపనిగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.
వట్టి రాజీనామాతో మంత్రివర్గ విస్తరణ జరిగి కొద్ది గంటలు కూడా కాకముందే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గట్టి షాక్ లాంటిందని పలువురు అంటున్నారు. తన రాజీనామాపై వట్టి వసంతకుమార్ మాట్లాడుకూ మంత్రివర్గంలో కేవలం అగ్రకులాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు.
రాజీనామా బాటలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నట్టు సమాచారం. అదేవిధంగా మరి కొందరు మంత్రులు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం మంత్రి ధర్మాన నివాసంలో పది మంది అసంతృప్త మంత్రులు భేటీ అయ్యారు.