రాష్ట్రంలో కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయ్: వెంకయ్య

శనివారం, 25 డిశెంబరు 2010 (16:45 IST)
రాష్ట్రంలో కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు జోస్యం చెప్పారు. ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం దూరం చేసుకోవడం ఆ పార్టీ చేసిన పెద్ద తప్పుగా పేర్కొన్నారు.

జగన్ దెబ్బ నుంచి కోలుకోవడం కాంగ్రెస్‌కు అంతసులభసాధ్యం కాదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పునాదులు కదులాయన్నారు. విజయవాడలో జగన్ చేసిన లక్ష్యదీక్షలో పాల్గొన్న వారిలో 95 శాతం కాంగ్రెస్ కార్యకర్తలేనని వెంకయ్య చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో ఏవిధంగా ఉన్నదో కాంగ్రెస్ నేతలకు వాస్తవ పరిస్థితులు తెలిసిన్పటికీ నేతలు మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. జగన్ లక్ష్యదీక్షకు వచ్చినవారు 96 శాతం మంది కాంగ్రెస్ కార్యకర్తలేనని ఆయన అన్నారు. వైయస్ జగన్‌తో జత కట్టే ప్రతిపాదన తమ పార్టీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

ఇకపోతే.. రాష్ట్ర రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ మంచిదైతే కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఎందుకు కలిశారని ఆయన ప్రశ్నించారు. రైతు సమస్యలపై ఈ నెల 28వ తేదీన సచివాలయం ముట్టడి చేపట్టనున్నట్లు వెంకయ్య ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి