ఇవ్వకుంటే అగ్నిగుండమే.. కేసీఆర్ : అంత సీనొద్దు.. సీమాంధ్ర

శుక్రవారం, 31 డిశెంబరు 2010 (10:30 IST)
రాష్ట్ర విభజం అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీమాంధ్ర నేతల మధ్య మాటలయుద్ధం ముదురుతోంది. కేసీఆర్ రెచ్చకొట్టేలా వ్యాఖ్యలు చేస్తే.. సహించే ప్రసక్తే లేదని సీమాంధ్ర నేతలు హెచ్చరిస్తున్నారు. తామేమీ చేతులు ముడుచుకుని కూర్చోలేదని వారు అంటున్నారు.

ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ ఏర్పాటు చేయకుండా ఎదో ఒక తిరకాసు పెడితే తిరగబడతామని కేసీఆర్ అన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ఇవ్వకుంటే అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. దీనిపై సీమాంధ్ర నేతలు భగ్గుమన్నారు. తామేమీ చేతులు ముడుచుకుని కూర్చోలేదని ప్రకటించారు.

ఇదిలావుండగా, తెలంగాణ రాష్ట్ర లక్ష్య సాధనపై ఈనెల ఆరో తేదీన తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను వెల్లడిస్తామని ప్రకటించారు. అలాగే, సీమాంధ్ర నేతలు కూడా ఈనెల 6వ తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి