వీహెచ్‌కు నోటిదురుసు కాస్త ఎక్కువే: బీవీ రాఘవులు

FILE
రాజ్యసభ సభ్యుడు వీహెచ్‌కు నోటిదురుసు కాస్త ఎక్కువని, అయినా సరే దాడి మాత్రం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన సొంతింటి వ్యవహారమనుకుంటోందని రాఘవులు విమర్శించారు.

అనంతపురంలో గురువారం రాఘవులు మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ సమైక్యానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన వల్ల తాగు, సాగునీటి సమస్యలతో పాటు మరిన్ని పరిష్కరించలేని సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆయన తెలిపారు.

పనిలో పనిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రపై మండిపడ్డ రాఘవులు, బాబు ముందుగా తన వైఖరిని స్పష్టం చేసి ఆ తర్వాత ఆత్మగౌరవ యాత్ర చేపట్టాలని డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి