సమైక్యం కోసం రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ రాజీనామా... ఆమోదం...!!

గురువారం, 22 ఆగస్టు 2013 (20:26 IST)
WD
నందమూరి హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గురువారం రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీని కలిసి ఆయన తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. తన వియ్యంకుడు, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఆయన తన సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు సమాచారం.

కాగా, సీమాంధ్ర ప్రాంతంలో చెలరేగిన సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా హరికృష్ణ తన గళాన్ని వినిపించిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా ఆయన ఇప్పటికే రాజీనామా చేస్తూ రాజ్యసభ ఛైర్మన్‌కు తన రాజీనామా కాపీని ఫ్యాక్స్ కూడా చేశారు. అయితే, అది ఆమోదం పొందక పోవడంతో తాజాగా ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాగా, హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వం మరో ఆరు నెలల్లో ముగియనుంది.

మరోవైపు.. కాగా, తెలంగాణ అనుకూలంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తొలుత స్వాగతించిన హరికృష్ణ ఆ తర్వాత తీవ్రంగా వ్యతిరేకిస్తూ లేఖ రాశారు. సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని ఆయన తేల్చి చెప్పారు. సమైక్యాంధ్ర నినాదంతో హరికృష్ణ సీమాంధ్రలో చైతన్య యాత్ర చేపడుతారని అంటున్నారు. హిందూపురం నుంచి ఆయన తన యాత్రను ప్రారంభిస్తారని ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి