జూ. ఎన్టీఆర్‌కు ఉస్మానియా జేఏసీ వార్నింగ్... సినిమాలు అడ్డుకుంటాం

గురువారం, 22 ఆగస్టు 2013 (20:05 IST)
WD
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ ఒక వార్నింగ్ ఇచ్చింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆగ్రహించిన ఓయూ జేఏసీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను తెలంగాణలో అడ్డుకుంటామని ప్రకటించారు.

ఇదే అంశంపై ఓయూ జేఏసీ నేతలు మాట్లాడుతూ హరికృష్ణ సమైక్యాంద్రకు మంద్దతుగా రాజీనామా చేసినందున ఆయన కొడుకు ఎన్.టి.ఆర్. సినిమాలను తెలంగాణలో ఆడనివ్వబోమని ప్రకటించింది. అంతేకాకుండా, జూనియర్ ఎన్టీఆర్ సమైక్యావాదో, తెలంగాణవాదో స్పష్టం చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది.

వెబ్దునియా పై చదవండి