జగన్ ఫోన్‌కాల్‌తో దీక్ష విరమించిన విజయమ్మ

శనివారం, 24 ఆగస్టు 2013 (15:35 IST)
FILE
రాష్ట్ర విభజన అంశంలో సమ న్యాయం కోసం ఆమరణ నిరాహారదీక్షకు దిగిన తన తల్లి వైఎస్ విజయమ్మ ఆరోగ్యంపై వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసి, దీక్షను విరమించాల్సిందిగా స్వయంగా కోరారు. ఇదే అంశంపై ఆయన చంచల్‌గూడ జైలు అధికారుల అనుమతి మేరకు విజమయ్మకు ఫోన్ చేశారు.

మరోవైపు.. సమైక్యాంధ్రకు మద్దతుగా జగన్ మోహన్ రెడ్డి చంచల్‌గూడ జైలులోనే ఆమరణ దీక్షకు దిగనున్నారు. ఆదివారం నుంచి చేపట్టనున్న దీక్షపై జగన్ అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. ఈ మేరకు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది.

తన తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ దీక్షను గుంటూరులో పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ దీక్ష చేస్తానని చెప్పారని, అయితే తాము వద్దన్నామని, దీక్ష చేస్తే జగన్‌ను వేరే రాష్ట్రంలోని జైలుకు పంపించే ప్రమాదం ఉందని వద్దన్నామని విజయమ్మ తన దీక్షను ప్రారంభించిన రోజు చెప్పిన విషయం తెలిసిందే. విజయమ్మ దీక్ష భగ్నం నేపథ్యంలో తాను దీక్ష చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి