జగన్ దీక్ష : 6 గంటలకు వైద్యబులిటెన్ .. జైలు అధికారులు

సోమవారం, 26 ఆగస్టు 2013 (13:45 IST)
File
FILE
సమ న్యాయం చేయాలని లేని పక్షంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ జైల్లో నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సోమవారం నిర్వహించిన వైద్య పరీక్షల ఫలితాలను సాయంత్రం ఆరు గంటలకు వెల్లడిస్తామని చంచల్‌గూడ జైలు అధికారులు వెల్లడించారు. సాయంత్రం మరోమారు ఆయనకు వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత వైద్య బులిటెన్‌ను విడుదల చేస్తామన్నారు.

రాష్ట్ర విభజన అంశంలో సమన్యాయం చేయాలంటూ జగన్ చంచల్‌గూడ జైలులో నిరాహార దీక్షకు దిగి 30 గంటలు దాటింది. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి జగన్ దీక్షకు దిగిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆయన ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదు. దీంతో ఆయనకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేస్తున్నారు.

జగన్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు వెల్లడించే వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. దీక్ష విరమించాల్సిందిగా జైలు అధికారులు కోరినప్పుడు జగన్‌ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అయితే, తాను ఎందుకు దీక్ష చేయాల్సి వచ్చిందో జైలు అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి