కేసీఆర్ ధీమా : తెలంగాణ ఏర్పాటు ఖాయం.. సభలో ఖుషీ

మంగళవారం, 27 ఆగస్టు 2013 (08:48 IST)
File
FILE
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన ఆయన సోమవారం లోక్‌సభకు హాజరై రిజిస్టర్‌లో సంతకం చేశారు.

ఆ తర్వాత ఆయన తన సీటులో కూర్చొన్నారు. ఈ సందర్భంగా పలువురు విపక్ష సభ్యులు ఆయనను అభినందించారు. తెలంగాణ సాధించినందుకు ధన్యవాదాలు అంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తాను ఆహార భద్రత బిల్లుపై ఓటు వేసేందుకు ఢిల్లీకి రాలేదని, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా రిజిస్టర్‌లో సంతకం పెట్టి పరిస్థితిని అధ్యయనం చేసేందుకు వచ్చినట్టు చెప్పారు.

అదేసమయంలో తెలంగాణ రావడం ఖాయమని, అందుకు శీతాకాల సమావేశాల వరకు కూడా వేచి ఉండాల్సిన అవసరం లేకపోవచ్చున్నారు. అంతకుముందు సభలో ఆహార భద్రత బిల్లుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ ఆద్యంతం ఆసక్తిగా వింటూ కూర్చుండిపోయారు.

వెబ్దునియా పై చదవండి